LOANS AND ADVANCES - APTEACHERS.IN
Headlines News :
Home » » LOANS AND ADVANCES

LOANS AND ADVANCES

Written By Unknown on Friday 23 March 2012 | 20:20

DESCRIPTION DOWNLOAD
GO.175 - All Loans and Advances detailed GO and Information

CLICK HERE

GO.174 - House Building Advance to Employees - Detailed Information

CLICK HERE

Application forms set for applying for House Building Advance

CLICK HERE

Marriage Advance Procedure and Applications Set

CLICK HERE

Application forms set for applying for Motor Cycle Advances

CLICK HERE

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం వివిధ అడ్వాన్స్ లు మరియు అప్పులు మంజూరు చేస్తుంది. వాటిలో గృహ నిర్మాణ, స్థలం కొనుగోలు అడ్వాన్స్, మోటర్ కార్ అడ్వాన్స్, కంప్యూటర్ అడ్వాన్స్, వివాహ అడ్వాన్స్, మొదలగునవి కలవు. వాటి మంజూరు విధి విధానాలు పరిశీలిద్దాం.
-"యు టి ఎఫ్ ఐక్యఉపాధ్యాయ నుండి సేకరించ బడినది.
www.apteachers.in వారిచే తెలుగు లో మీ కోసం అందించబడుతుంది"
గృహ నిర్మాణ అడ్వాన్స్:
        ఈ అడ్వాన్స్ ఇంటి స్థలం/ గృహ నిర్మాణం / గృహం కొనుగోలు / ఇంటి స్థలం కొని ఇల్లు నిర్మించుకోవడానికి /  గృహ మరమ్మత్తులు నిమిత్తం మంజూరు చెయ్యబడుతుంది
అర్హత :
       8 సం. ల సర్వీసు కలిగిన రెగ్యులర్ ఉద్యోగులు అర్హులు. భార్య భర్తలు ఇరువురు ఉద్యోగులు ఐతే ఒకరు మాత్రామే అర్హులు. గతం లో ఇంటి స్థలం కొనుగోలు / గృహ నిర్మాణం నకు ఋణం పొందని వారు, ఉద్యోగి పేరు మీద / భార్య / మైనరు పిల్లల పేరు మీద ఇల్లు లేని వారు అర్హులు.
అడ్వాన్సు గా మంజూరు అయ్యే మొత్తం:
 గృహ నిర్మాణం / గృహం కొనుగోలు నిమిత్తం మూల వేతనానికి 72 రెట్లు లేదా 2010 వేతన స్కేళ్ళ ప్రకారం
మూల వేతనం రూ. 13660 /- ల వరకు గరిష్టం గా 5  లక్షలు,
 మూల వేతనం రూ. 21820 /- ల వరకు గరిష్టం గా 7  లక్షలు, 
ఆ పై మూల వేతనం 10 లక్షలు మంజూరు చెయ్యబడుతుంది. 
అసలు 240 , వడ్డీ 60 నెలసరి వాయిదా లలో చెల్లించాలి

వడ్డీ రేటు :
RPS  2010  నందు వడ్డీ రేటు ను సంవత్సరానికి 4వ తరగతికి 5 % , ఇతరులకు 5 .5 % గ నిర్ణయించారు.
అడ్వాన్సు పంపిణి:
       స్థలం కొనుగులు కొరకు మంజూరు అయ్యే అడ్వాన్సు లో 25 % స్థలం కొనుగులు అగ్రీమెంట్ పూర్తి అయిన తరువాత చెల్లిస్తారు. మిగిలిన మొత్తం స్థలం రిజిస్టర్ సమయంలో స్థలం అమ్మకం దారుకు చెక్కు ద్వారా చెల్లిస్తారు. 
స్థలం తో సహా గృహ నిర్మాణం కోసం కూడా అడ్వాన్సు మంజూరు అయ్యే సందర్భంలో పైన తెలిపిన విధంగా  మంజూరు ఐన 25 % అడ్వాన్సు డ్రా చేసిన రెండు నెలలలోపు స్థలం కొన్న ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. స్థలం ప్రభుత్వానికి తనఖా చేసిన అనంతరం అడ్వాన్సు లో 50 % చెల్లిస్తారు. మిగిలిన 25 % అడ్వాన్సు కప్పు వరకు నిర్మాణం జరిగిన అనంతరం చెల్లిస్తారు. 
        స్థలం కాకుండా కేవలం గృహ నిర్మాణం కోసం మాత్రమె అయితే స్థలం ప్రబుత్వం పేర తనఖా చేసిన అనంతరం అడ్వాన్సు లో 1 / 3  వంతు, గోడలు నిర్మాణం పూర్తైన తరువాత రెండవ విడతగా 1 / 3  వంతు, నిర్మాణం కప్పు వరకు చేరితే మిగిలిన 1 / 3  వంతు చెల్లిస్తారు.
మరమ్మత్తులు, అదనపు నిర్మాణాల సందర్భం లో ప్లాన్, అంచనా విలువ, ప్రభుత్వం పేరన మర్టిగేజ్ పూర్తైన వెంటనే ఏక మొత్తం గా అడ్వాన్సు చెల్లిస్తారు 
మంజూరు అధికారం:
     ఈ అడ్వాన్సు మంజూరు అధికారం కార్యాలయ అధికారికి జి వో 131 ఆర్ధిక, తేది 19.08.1997 ద్వారా దఖలు పరచబడినది. దరఖాస్తు అందిన వెంటనే కార్యలయాధిపతి, వివరాలను శాఖాదిపతి కి తెలిపి బడ్జెట్ విడుదల ఐన తదుపరి చెల్లిస్తారు. ఉపాధ్యాయుల విషయంలో డి.ఇ.వో మంజూరు అధికారిగ ఉంటారు.
దరఖాస్తు చేసే విధానం:
  • ఈ అడ్వాన్సు పొంది గృహ నిర్మాణం / కొనుగోలు చేసిన వారు ప్రభుత్వ వసతి నివాసాలకు అర్హులు కారు 
  • గృహాన్ని కొనుగోలు చేసిన సందర్భం లో అడ్వాన్సు అమ్మకందారునికి చెక్కు / డ్రాఫ్ట్ ద్వారా చెల్లించబడుతుంది.
  • రిజిస్ట్రేషన్ తదితర రుసుములకు అడ్వాన్సు నుండి చెల్లించవచ్చును.
  • సర్వీసు మొత్తం మీద ఒక పర్యాయం మాత్రమె అడ్వాన్సు చెల్లించబడుతుంది. ఐతే మరమ్మత్తులు / అదనపు నిర్మాణాల కొరకు మొదట మంజూరు ఐన మొత్తం పూర్తిగా చెల్లించిన తరువాత రెండవ పర్యాయం మంజూరు చేస్తారు.
  • హుడా / హౌసింగ్ బోర్డుచే గృహ మంజూరు కాబడిన వారికి ఈ అడ్వాన్సు మంజూరు చెయ్యబడదు. అయితే మరమ్మత్తులు నిమిత్తం ఋణం మంజూరు చెయ్యబడుతుంది. 
  • దరఖాస్తు దారునితో సమాన వేతనం గల ఉద్యోగి హామిదారుగా ఉండాలి
  • అడ్వాన్సు తొలత వివరాలు సేవా పుస్తకంలో నమోదు చెయ్యాలి
  • నిబంధనలకు విరుద్దంగా అడ్వాన్సు ఖర్చు చేసినా, దుర్వినియోగం చేసిన అపరాధ వడ్డీనే కాకుండా సి.సి.ఏ నిబంధన ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోబడుతాయి.
వివాహ అడ్వాన్స్
వివాహ అడ్వాన్స్ ను మొదటగా జి వో 90 తేది 26.3.1070 ద్వారా ప్రవేశ పెట్టడం జరిగింది. 2010 వేతన స్కేల్ లలో జి వో 175  తేది 15.5.2010 ద్వారా పెంపుదల చేయటం జరిగింది
మంజూరు చేసే మొత్తం
పురుష ఉద్యోగుల వివాహం లేదా పురుష లేదా మహిళా ఉద్యోగి కుమారుల వివాహం నాకు 4 వ తరగతి ఉద్యోగులు ఐతే రూ.30000/-  లు మిగిలిన వారికి రూ .50000/-  లేదా 15 నెలల మూల వేతనం లో ఏది తక్కువ ఐతే అది అడ్వాన్స్ గా మంజూరు చెయ్య బడుతుంది.
మహిళా ఉద్యోగి వివాహం నాకు లేదా పురుష/ మహిళా ఉద్యోగి కుమార్తె వివాహం నకు, 4 వ తరగతి ఉద్యోగులైతే రూ .50000/- మిగిలిన వారికి రూ. 75000/- లేదా 15 నెలల మూల వేతనం ఏది తక్కువ ఐతే అది అడ్వాన్స్ గా మంజూరు చేయబడుతుంది.
అసలు 70 వడ్డీ 10 నెలసరి వాయిదా లలో చెల్లించ వలసి ఉంటుంది. వడ్డీగా నాలుగవ తరగతి ఉద్యోగులు ఐతే సంవత్సరానికి 5 % మిగిలిన వారికి 5.5% వాసులు చేయబడుతుంది.
అర్హత :
అందరు శాశ్వత ఉద్యోగులు అర్హులు. శాశ్వత వ్రాత పరీక్ష పై నియమించబడిన నాన్ పర్మినంట్ ఉద్యోగులు, జీత నష్టపు సెలవు  మినహా మిగిలిన సెలవులలో ఉన్న ఉద్యోగులు అర్హులు. ఉద్యోగి భార్య / భర్త / ఉద్యోగి తల్లి / తండ్రి ఉద్యోగులు ఐతే ఒకరు మాత్రమే అడ్వాన్సు కు అర్హులు. దత్తత తీసుకున్న కుమారుడు / కుమార్తె వివాహమునకు కొన్ని షరతులకు లోబడి అడ్వాన్స్ పొందవచ్చును. సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి, గతములో మంజూరు ఐన అడ్వాన్స్ బకాయి ఉన్న వారు, మొత్తం జీతం లో ఈ అడ్వాన్స్ సంబంధించి వాయిదాతో కుడా కలిపి 75 శాతం మినహాయింపులు దాటినా వారు అర్హులుకారు.


విద్యా అడ్వాన్స్


పిల్లల ఫీజు, పుస్తకాలు కొనుగోలు నిమిత్తం ఈ అడ్వాన్స్ మంజూరు చేయబడుతుంది.
కనీసం రెండు సంవత్సరాలు సర్వీసు కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులు అర్హులు.
భార్య, భర్తలు ఇరువురు ఉద్యోగులు ఐతే ఒకరు మాత్రమే అర్హులు
ఒక ఆర్ధిక సంవత్సరంలో ఒక సారి మాత్రమే చెల్లించబడుతుంది.
2010 వేతన స్కేళ్ళ ప్రకారం ఈ అడ్వాన్స్ రూ.5000 వరకు మంజూరు చేయబడుతుంది
10 సమాన వాయిదాలలో రికవరీ చేస్తారు. వడ్డీ లేదు.
నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేస్తే బడ్జెట్ లభ్యత, ట్రెజరీ కంట్రోల్ దృష్టిలో ఉంచుకొని మంజూరు చేయబడుతుంది.


పండుగ అడ్వాన్స్

2010 వేతన స్కేళ్ళ ప్రకారం నాల్గవ తరగతి ఉద్యోగులు 13360-38570, లేదా అంతకన్నా తక్కువ వేతన స్కేళ్ళు కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఈ అడ్వాన్స్ పొందటానికి అర్హులు. ( ఉపాధ్యాయులలో స్కూల్ అసిస్టెంట్ తత్సమాన మరియు 12 సంవత్సరాల స్కేలు పొందిన సెకండరీ గ్రేడ్ తత్సమాన ఉపాధ్యాయులకు అర్హత లేదు )
నాల్గవ తరగతి ఉద్యోగులకు రూ.2000 లు మిగిలిన వారికి రూ.3000 లు అడ్వాన్స్ గా మంజూరు చేయబడుతుంది.
10 సమాన వాయిదాలలో రికవరీ చేస్తారు. వడ్డీ లేదు.
ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితాలో పేర్కొన్న అన్ని పండుగలకు (సాదారణ మరియు ఐచ్చిక సెలవులుగా ప్రకటించిన) మతం తో సంబంధం లేకుండా అడ్వాన్స్ పొందవచ్చును. ఐతే జాతీయ పర్వదినాలైన స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డె లకు ఈ అడ్వాన్స్ మంజూరు చేయబడదు.
పండగలకు రెండు వారాలు ముందు లేదా ఆ లోపు మాత్రమె మంజూరు చేయబడుతుంది.

ప్రత్యెక పండుగ అడ్వాన్స్


చేనేత వస్త్రాల కొనుగోలుకు ప్రత్యెక పండుగ అడ్వాన్స్ మంజూరు చేయబడుతుంది
గెజిటెడ్ వారికి రూ.5000 లు, నాన్ గెజిటెడ్ వారికి రూ. 4000 లు, నాలుగవ తరగతి ఉద్యోగులకు రూ.3000 లు మంజూరు చేయబడుతుంది.
ఈ మంజూరు సొమ్ము అమ్మకం దారుకి నేరుగా చెక్కు ద్వారా చెల్లించబడుతుంది
ఒక ఆర్ధిక సంవత్సరంలో ఒక సారి మాత్రమె మంజూరు చేస్తారు
పది సమాన వాయిదాలలో రికవరీ చేస్తారు. వడ్డీ లేదు.

మంజూరు అధికారం


జిల్లా, ప్రాంతీయ కార్యలయాదిపతులు మంజూరు అధికారులు గా ఉంటారు. ఉపాధ్యాయులకు సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారి మంజూరు అధికారిగా ఉంటారు. అడ్వాన్స్ మంజూరు నిధుల లభ్యత పై ఆధారపడి ఉంటుంది. హక్కు గా భావించరాదు.

దరఖాస్తు చేసే విధానము.


వివాహమునకు 6 నెలలు లేదా అంతకు తక్కువ నుండి మాత్రమే దరఖాస్తులు అంగీకరిస్తారు. దరఖాస్తు ను ఫారం నం.1 లోను, అగ్రీమెంట్ ఫారం నం.2 లోను సమర్పించాలి.

మంజూరు విధానం :


వివాహం నకు 2 నెలల ముందు లేదా ఆ లోపు మాత్రమె డ్రా చేయాలి. ఐతే వివాహంనకు ముందే దరఖాస్తు చేసి ఉంటె వివాహం తరువాత కుడా మంజూరు చేయవచ్చును. ఉద్యోగి జీతంతో తక్కువ కాని జీతం పొందుతున్న, అడ్వాన్స్ పూర్తిగా రికవరీ జరిగేవరకు పదవి విరమణ చేయని మరొక ఉద్యోగితో కలిసి వ్యక్తిగత సెక్యురిటి బాండ్ ఫారం - 3 లో సమర్పించిన అనంతరం అడ్వాన్స్ చెల్లించబడుతుంది.



కంప్యూటర్ అడ్వాన్స్:
కంప్యూటర్ అడ్వాన్స్ కొనుగోలు నిమిత్తం ఈ అడ్వాన్స్ మంజూరు చేస్తారు. 2010 వేతన స్కేళ్ళ ప్రకారం రు. 22430/- మరియు ఆపై మూల వేతనం గల వారు అర్హులు (జి.వో.97 తేది.21.05.2011). ఈ అడ్వాన్స్ రు.50000/- వడ్డీ గా లేదా కంప్యూటర్ వాస్తవ ధరలలో ఏది తక్కువైతే అది మంజూరు చేస్తారు. అసలు 135, వడ్డీ 65 నెలసరి వాయిదాలలో రికవరీ చేస్తారు. వడ్డీ గా నాలుగవ తరగతి ఉద్యోగులైతే 5% , మిగిలిన వారి నుండి 5.5% వసూలు చేస్తారు.

కారు అడ్వాన్స్:
రు.27700/-లు ఆపై మూలవేతనం గలవారు అర్హులు. ఈ అద్వ్నసే రు.4,50,000/- లు లేదా 15 నెలల  మూలవేతనం లేదా కారు వాస్తవ ఖరీదులలో ఏది తక్కువైతే అది మంజూరు చేయబడుతుంది. అసలు 135, మరియు వడ్డీ 65 నెలసరి వాయిదాలలో రికవరీ చేయబడుతుంది. వడ్డీగా నాలుగవ తరగతి ఉద్యోగులైతే 5% ఇతరులైతే 5.5% వసూలు చేయబడుతుంది.



మోటార్ సైకిల్ / స్కూటర్/మోపెడ్ అడ్వాన్స్ :
2010 వేతన సంవత్సరానికి  మరియు అందరు 2 సం. పూర్తి చేసిన డ్రైవర్ లు వేతనం తో సంబంధం లేకుండా సైకిల్ అడ్వాన్స్   ఇంతకూ మునుపు మోటర్ కార్/ మోటర్ సైకిల్ / స్కూటర్ అడ్వాన్స్ తీసుకున్నవారు తప్ప అందరు అర్హులే

Share this article :

No comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. APTEACHERS.IN - All Rights Reserved
Template Modify by Creating Website
Proudly powered by Blogger