హెల్త్ కార్డు లు వివరాలు నింపుటకు సూచనలు
మీ వివరాలు నింపుటకు లాగిన్ అవ్వుట- *మొదట గా హెల్త్ కార్డు లు నింపుటకు వెబ్ సైట్ ను తెరిచి అందులో మీ ట్రెజరీ ID నెంబర్ ను ఎంటర్ చెయ్యాలి
- వెంటనే మీ పేరు వస్తుంది
- ఆ తరువాత మీకు ఇష్టం వచ్చిన పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యాలి
- తిరిగి మళ్లి ఇంకొక సారి ఎంటర్ చెయ్యాలి
- మీ DDO యొక్క కోడ్ ను ఎంటర్ చెయ్యాలి. ఆ తరువాత LOGIN అవ్వాలి
- *ఇది వరకే ఎప్పుడైనా మీరు లాగిన్ అయ్యి వుంటే మీ ట్రెజరీ ID నెంబర్ ను ఎంటర్ చేసిన తరువాత మీరు ఇంతకూ ముందు పెట్టుకున్న పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యాలి
- *మీ పాస్ వర్డ్ మర్చి పొతే మీ STO ను కాంటాక్ట్ చెయ్యండి
- *పాస్ వర్డ్ గా మీ కుటుంబ సభ్యుల పేర్లు గాని, మీ సెల్ నెంబర్ లు గాని పెట్టుకుంటే మీరు మరిచి పోవడం తక్కువ! .
ఫారం - 1 నింపుట
మీరు లాగిన్ తరువాత మొదటగా ఫారం - 1 లో మీ వివరాలు నింపవలసి ఉంటుంది
- ఫారం - 1 నాలుగు భాగాలుగా ఉంటుంది. 1 వ భాగం లో ఉద్యోగి వివరాలు, 2 వ భాగం లో కార్యాలయ వివరాలు, 3 వ భాగం లో నివాస వివరాలు, 4 వ భాగం లో అదనపు వివరాలు పొందపోరచవలసి ఉంటుంది
- *గుర్తు కలిగిన వివరాలు తప్పని సరిగా నింపాలి
- సీరియల్ నెంబర్ 2. Sector Type లో State Govt/ Zilla Parishad/ Aided Edn Instutns/ Zilla Praja Parishad/ Mandal Praja Parishad/ Gram Panchayat/ Municipal Corporation/ Municipalities,..etc నుండి ఒకదానిని సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది
- సీరియల్ నెంబర్ 3 లో Department Code గా టీచర్లు అందరు SCHOOL EDUCATION ను సెలెక్ట్ చెయ్యాలి
- సీరియల్ నెంబర్ 4 లో Employee Designation దగ్గర మన Designation అనగా Secondary Grade Teacher, PET, SA (Maths)....ను సెలెక్ట్ చెయ్యాలి
- సీరియల్ నెంబర్ 10 లో Designation Status లో Gazetted లేదా Non Gazetted సెలెక్ట్ చెయ్యాలి
- సీరియల్ నెంబర్ 11 లో PRC 2012 ను సెలెక్ట్ చెయ్యాలి.
- మిగిలిన వివరాలు 2,3,4 భాగాలలో నింపాలి. 4 వ భాగం లో PF, PRAN, APGLI, AADHAR, RATION CARD...లలో మనకు లేని వివరాలు నింప వలసిన అవరసరం లేదు. వాటిని ఖాళీగానే ఉంచవలెను
- అన్ని వివరాలు సరిచుసుకున్న తరువాత కిందన ఉన్న Updata to Continue పై క్లిక్ చేసి ఫారం - 2 కు వెళ్ళవలెను
ఫారం - 2 నింపుట
- ఫారం - 2 లో మొదటగా మన వివరాలు సరిచూసుకుని కుడి పక్క చివరన గల BROWSE పై క్లిక్ చేసి మీ యొక్క ఫోటో ను అప్ లోడ్ చెయ్యాలి. వెంటనే మీ ఫోటో అక్కడ కనిపిస్తుంది
- (IMP: ఫోటో యొక్క సైజు ను 100kb కు మించ కూడదు. jpg, jpeg, png ఫార్మాట్ లలో మాత్రమే ఉండాలి
- పాస్ పోర్ట్ సైజు ఫోటో మాత్రమే అప్ లోడ్ చెయ్యాలి.)
- తరువాత మీ Dependents Details ను ఎంటర్ చెయ్యాలి.
- అందులో Dependent Emp Code దగ్గర మీ Dependent కనుక employee ఐతే వారి కోడ్ ను ఎంటర్ చెయ్యాలి లేనిచో ఖాలిగా ఉంచాలి
- చివరగా వారి ఫోటో ను కుడా అప్ లోడ్ చెయ్యాలి
- తరువాత Add Details పై క్లిక్ చేసి ఇతర కుటుంబ సభ్యుల వివరాలు కుడా నింపాలి.
- మీరు ఎంటర్ చేసిన కుటుంబ సభ్యుల వివరాలు పైన అడ్డు వరసలలో వచ్చి చేరుతాయి.
- అన్ని వివరాలు సరిచుసుకున్న తరువాత Submit to DDO & Print Form పై క్లిక్ చేసి మీ వివరాలు ప్రింట్ తీసి మీ DDO కు అందచేయ్యాలి. ఒక కాపీ మీ వద్ద కూడా ఉంచుకోవాలి .
- మీకు ఏమైనా సం దేహాలు ఉంటె మీ DDO ను సంప్రదించండి. ఆ తరువాత మాత్రమె నింపండి.
ఇట్లు డబ్లు డబ్లు డబ్లు . ఎ పి టీచర్స్ . ఇన్ వారి చే అందించ బడినది
ఆంద్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ - విశాఖపట్నం జిల్లా
No comments:
Post a Comment